మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి అత్యంత సులభమైన, సురక్షితమైన మార్గం
పాస్‌వర్డ్‌లకు పాస్-కీలు సులభమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయం. అవి మీ వేలిముద్ర, ఫేస్ స్కాన్ లేదా స్క్రీన్ లాక్‌తో సైన్ ఇన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
-
ఇది ఎంతో సులువు
పాస్-కీలు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి మీ వేలిముద్ర, ఫేస్, pin లేదా ఆకృతి వంటి మీ పరికర లాక్‌ను ఉపయోగించే అనుకూలమైన, సులువైన ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.
-
సురక్షితం
పాస్-కీలు బలమైన రక్షణను అందిస్తాయి. వాటిని ఎప్పటికీ ఊహించలేరు లేదా తిరిగి ఉపయోగించలేరు; ఆవిధంగా అవి అటాక్ చేసేవారి నుండి మీ ప్రైవేట్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి.
-
ప్రైవేట్
వేలిముద్ర లేదా ఫేస్ స్కాన్ వంటి మీ బయోమెట్రిక్ డేటా మీ వ్యక్తిగత పరికరంలో స్టోర్ చేయబడుతుంది, Googleతో ఎప్పుడూ షేర్ చేయబడదు.
1-2-3 లాగే సులువైనది
మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి, మీ పరికరంతో మీ పాస్-కీని సెటప్ చేయండి, అంతే, మీరు సిద్ధమైనట్లే!